Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీబీనగర్:భువనగిరి నియోజకవర్గ అభివద్ధిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ.శ్యామ్‌సుందర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని వెంకిర్యాల గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని, కేవలం ఎలక్షన్ కలెక్షన్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భువనగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. నియోజకవర్గం లో సాగునీటి కాల్వలు, రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో పూర్తిచేయకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీకి 50 మంది యువకులు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, నాయకులు కర్నాటి ధనుంజయ, జిల్లా కార్యదర్శి కొండం ఉపేందర్‌గౌడ్, పిట్టల అశోక్, పొట్ట నవీన్, సంకూరి శ్రీకాంత్, వెంపటి సుదర్శన్, చింతపట్ల నాగరాజు, రామకష్ణ, సుధాకర్, ఆముదాల సందీప్, చెరుకు ఎల్లయ్య పాల్గొన్నారు.