Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడుకు చెందిన నిరుద్యోగ మహ్మద్ షబ్బీర్ ఆత్మహత్యకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణకేంద్రంలో బస్‌స్టేషన్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, షబ్బీర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి కర్రే అజరు, జూకంటి సంపత్, పర్రే రమేష్ ,కలకుంట్ల లోకేష్, ప్రభు , భాస్కర్ , వెంకటస్వామి , జానకిరామ్, ప్రశాంత్, కర్ణాకర్ పాల్గొన్నారు.
భువనగిరి: ఇల్లంతకుంట గ్రామనికి చెందిన నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వమే కారణమని నిరసన తెలుపుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణకేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు,నియమాలు కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు పిట్టల రాలిపోతున్నారన్నారు. .ఇప్పటి కైనా ప్రభుత్వం బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 1,91,126 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భతి రూ.3016 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పుట్ట గిరీష్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు వంగాల వెంకన్న, ముత్యాల మనోజ్, కాకునూరి మహేందర్,ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దర్గా హరి ప్రసాద్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కొల్లారి రాజు,ప్రధాన కార్యదర్శులు దయ్యల శ్రీశైలం, నరముల నవీన్, పాల్గొన్నారు.