Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుంగతుర్తి :మండల పరిధిలోని సూర్యతండ గ్రామపంచాయతీ పరిధిలో ఎస్ఆర్ఎస్పీ కాలువపై నిర్మించిన కల్వర్టును సోమవారం మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, సర్పంచ్ యాకునాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వర్టు లేకపోవడంతో గుట్టకిందితండా రైతులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే డీఎంఎఫ్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మోహన్‌లాల్, భద్రు తండావాసులు పాల్గొన్నారు.