Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
మున్సిపల్ కేంద్రంలో హిందూ స్మశాన వాటిక అత్యంత దయనీయంగా ఉందని, స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పలు ప్రజా సంఘాల బాధ్యులు జెడ్పీ సీఈవోను కోరారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం స్మశానవాటికను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనంజయనాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అధ్వానమైన స్మశాన వాటిక ఎక్కడా లేదన్నారు. మున్సిపల్ పాలకవర్గ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. స్మశాన వాటికకు వెళ్లేందుకు కనీసం దారి కూడా సరిగా లేదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు ఎ.లక్ష్మి, ఏఐటీయూసీ మండలాధ్యక్షుడు ఊదర వెంకన్న, ఏఐఎస్ఎఫ్ మండలాధ్యక్షుడు కొమర్రాజు వెంకట్, ఏఐటీయూసీ పట్టణాధ్యక్షుడు అయిల నాగేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ పట్టణాధ్యక్షుడు రెడ్డిపల్లి వినరు, మహిళా సమాఖ్య పట్టణాధ్యక్షురాలు నూతనగంటి నర్సమ్మ, ఏఐటీయూసీ పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీపాద శ్రీనివాసాచారి పాల్గొన్నారు.