Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు పీడీఎస్‌యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో తలపెట్టిన మంత్రి జగదీశ్‌రెడ్డి ఇల్లు ముట్టడిని జయప్రదం చేయాలని పీవైఎల్ రాష్ట్ర కోశాధికారి కునుకుంట్ల సైదులు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఏడేండ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మందడి శ్రీధర్, దండి ప్రవీణ్, మురళి, మందడి శశిన్, తదితరులు పాల్గొన్నారు.