Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది మార్చిలో రూ.73 లక్షలు మంజూరు
- ఏడాదిన్నరగా వథాగా ఉన్న నిధులు
- అభివద్ధికి నోచని దళిత కాలనీలు
నవతెలంగాణ-మోత్కూర్
మున్సిపాలిటీ పరిధిలోని దళిత కాలనీలు, వాడల అభివద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఆ నిధులను ఆ కాలనీల అభివద్ధికి ఖర్చు చేయకపోవడంతో బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఎస్సీ కాలనీలు, వాడల అభివద్ధికి ప్రభుత్వం మున్సిపాలిటీకి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 2020 మార్చిలో రూ.73 లక్షల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో మున్సిపల్ కేంద్రంతో పాటు విలీన గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, తదితర అభివద్ధి పనులు చేయాల్సి ఉంది. కానీ మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ఆ కాలనీల అభివద్ధి గురించి పట్టించుకోకపోవడం, ఎలాంటి ప్లాన్ లేకపోవడంతో రూ.73 లక్షల నిధులు సుమారు ఏడాదిన్నర వథాగా ఉన్నాయి.
మున్సిపల్ కేంద్రంలో గాంధీనగర్, ఇంద్రానగర్, మాలవాడ, విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురంలో ఎస్సీ కాలనీలు ఉండగా ఆ కాలనీల్లో 90 శాతంకు పైగా బజార్లలో సీసీ రోడ్లు, మురికి కాలువలు లేవు. దీంతో ఆ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లో మురుగు కాల్వలు లేక మురుగు నీరంతా వీధుల్లో పారుతున్నాయి. దీంతో దుర్వాసన వేదజల్లడంతో పాటు దోమలు వ్యాపించి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వీధులన్ని బురదమయంగా మారుతున్నాయని, పిల్లలు, వద్ధులు జారీ పడుతున్నారని వాపోతున్నారు. మున్సిపాలిటీలో ఉపాధి హామీ చట్టం రద్దయినందున ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నా నిర్మించకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధుల లేమితో అభివద్ధి పనులు చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చని, కానీ లక్షల్లో నిధులు ఉన్నా అభివద్ధి పనులు ఎందుకు చేయడం లేదని, తమ కాలనీలో అభివద్ధిపై పాలకులు, అధికారులు వివక్ష చూపుతున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాలని ఇటీవల ఎస్సీ కాలనీల యువకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం కూడా అందజేశారు. అభివద్ధి పనులకు నిధులు ఖర్చు చేయకపోవడంతో ఆ నిధులు వాపస్ వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ కాలనీల్లో అభివద్ధి పనులు చేపట్టాలి
మందుల సురేష్, గాంధీనగర్, మోత్కూర్
ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన నిధులతో ఎస్సీ కాలనీల అభివద్ధి చేయాలి. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిధులు వాపస్ వెళ్లకుండా, పక్కదారి పట్టకుండా ఎస్సీల అభివద్ధికి ఖర్చు చేయాలి. మరుగుదొడ్లు లేని వారికి నిర్మించాలి.
రూ.43 లక్షలకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం
షేక్ మహమూద్, మున్సిపల్ కమిషనర్, మోత్కూర్
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.73 లక్షల్లో రూ.43 లక్షలకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఎస్సీ కాలనీలు, వాడలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలకు నెలరోజుల్లో టెండర్లు పిలుస్తాం. మిగతా నిధులతో అవసరం ఉన్న చోట కూడా పనులను చేస్తాం. సబ్ ప్లాన్ నిధులు వాపస్ వెళ్లిపోవు. 2022 మార్చి వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.