Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతుల్లేని స్థలాల్లో జంతువుల వధ
- నాణ్యత లేని మాంసం విక్రయం
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, మోత్కూర్, ఆలేరు, చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట ఉన్న ఆరు మున్సిపాలిటీలలో ఏ ఒక్క మున్సిపాలిటీలో జంతువుల వధశాలలు లేవు. రోగాలు, బక్కచిక్కిన మూగజీవాలను కోసి నాణ్యతలేని మంసాన్ని విక్రయిస్తున్నారు. మాంసం తిని మంచిగా కావాల్సిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు.
జంతు వధ శాల (స్లాటర్ హౌస్)
పశువులు, గొర్రెలు, మేకలు లేదా పందులను కోసేందుకు స్లాటర్ హౌస్‌లు ఏ మున్సిపాలిటీలోనూ లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మున్సిపాలిటీలోనూ బహిరంగ జంతువుల వధ శాలలుగా వినియోగించు ఉపయోగించడానికి స్థలాలను ఉపయోగించవచ్చు. స్థలం వినియోగించిన వారి నుండి ఫీజులను ఛార్జ్ చేయవచ్చని నిబంధన ఉంది. ఆ నిబంధనలను మున్సిపాలిటీలు అమలు చేయడం లేదు.
జిల్లా కలెక్టర్ బాధ్యత..!
జిల్లా కలెక్టర్ తన పరిధిలోని భూములలో సంబంధిత భూమిని పురపాలక అధికారులకు సమకూర్చాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సంచాలకులుతో సంప్రదించి ఒక నిర్దిష్ట సమయం విధానంలో ప్రస్తుతం ఉన్న అన్ని జంతువుల శాలలను ఆధునీకరించడానికి కషి చేయాలని అనే నిబంధన ఉన్నప్పటికీ అధికారులు ముఖ్యంగా కమిషనర్లు అటువైపు ఆలోచించడం లేదు. వధ శాలలు ఎక్కడా లేకపోవడంతో సంబంధిత వ్యాపారులు జంతువులను వధించి వాటి వ్యర్థాలను మురుగు కాల్వల్లో పడేస్తున్నారు. దీంతో పందులు, కుక్కలు, పందికొక్కులు, స్వైరవిహారం చేస్తున్నాయి. ఈగలు, దోమల సంఖ్య వృద్ధిచెంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
పుర పాలిక చేయాల్సిన పనులు
తెలంగాణ పురపాలక చట్టం 2019 ,(2020 యొక్క 8వ చట్టం సవరణ) తోపాటు నిబంధనల ప్రకారం పాలిక పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలి. బహిరంగ లేదా లైసెన్స్ గల వధశాలలు మినహా ఇతర స్థలాలలో వధ నిషేధ క్రమబద్ధీకరణ నియమాలలో నిర్దిష్ట పరచినట్టుగా జంతువులను లేక చర్మాన్ని తీయటం అన్ని సందర్భాలలో అనుతించొద్దు. విక్రయించే నిమిత్తం జంతువులను వధించడానికి తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. వర్షాలు లేక మాంసాన్ని క్రయ విక్రయాలు జరిగే ప్రదేశాలను తనిఖీ చేయాలి.
ప్రజా ఆరోగ్యం పై దష్టి ఏది..
పురపాలిక ప్రాంతంలో జంతువుల వల్ల సంభవించే వ్యాధులను నివారించడానికి లేక వ్యాప్తి నియంత్రణ కోసం జంతువులను కోసేటప్పుడు ముందు తప్పనిసరిగా పశు వైద్య అధికారులు ప్రజలు ఆహారంగా తీసుకోవడానికి ఆరోగ్యంగా ఉన్నాయని ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఆ పత్రాలు ఉంటేనే జంతువులను వధ చేయాలి. ఎవరైనా అలాంటి పత్రాలను చూపించుకుంటే మున్సిపల్ అధికారులు మాంస విక్రయశాలకు వెళ్లి ఆ మాంసంను ఎవరూ కొనకుండా సీజ్ చేసి తీసుకెళ్లవచ్చు.
వధ శాలలు ఏర్పాటు చేయాలి -సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వధశాలలు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆయా మున్సిపాలిటీలలో స్థల సేకరణ చేసి వధశాలను ఆధునిక పద్ధతిలో నిర్మించాలి. కరోనా పరిస్థితులలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజారోగ్యంపై మున్సిపల్ అధికారులు దష్టి సారించాలి. నాణ్యమైన మాంసం విక్రయం జరిగే విధంగా మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలి.