Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాటి చెట్టు పై నుంచి జారి పడడంతో మృతి చెందిన సంఘటన సోమవారం మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపల్ కేంద్రంలోని సాయిబాబా కాలనీకి చెందిన మాద కేశవులు (36) సోమవారం ఉదయం కస్తూర్బా ప్రాంతంలో కల్లు తీయడానికి తాటి చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అక్కడికక్కడే మతి చెందాడు. చుట్టుపక్కల ఉన్న తోటి గీత కార్మికులు, రైతులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మతునికి భార్య, కూతురు ఉన్నారు. శవాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియాస్పత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గీత కార్మికుడు కేశవులు కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించాలని గీత కార్మిక సొసైటీ నాయకులు కోరారు.