Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కష్ణానదిపై సాగు,తాగు నీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడానికి నిధుల కేటాయింపు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో హాలియాలో జరిగిన ప్రగతి సమీక్షా సమావేశానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ నివాసంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగు, తాగు నీరందించాలని కోరారు.నది పరివాహక ప్రాంతంలో ఉన్నకృష్ణానది జలాలు తాగునీటి అవసరానికి అందించాలన్నారు.ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమగట్టు సొరంగమార్గం ద్వారా 51.06 కిలోమీటర్లు 2005లోనే నిర్ణయించిర ూ. 2813 కోట్లను తాజాగా సవరించి రూ.3074. 73 కోట్లకు పెంచి రూపొం దించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 010లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు డిసెంబర్ 31, 2023లో పూర్తి చేయడానికి సంబంధించిన సంస్థకు అవకాశం ఇచ్చి పొడిగించమని నేటికి పది కిలోమీటర్ల మేర సొరంగం పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ చేయలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో సంస్థ నిధుల కొరతతో కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి ఉండడం వల్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని ఆవేదన చేశారు.మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఇంకా రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే కానీ పూర్తి కాదనిన్నారు.లైనింగ్ పనులు సత్వరమే పూర్తి చూడాలని కోరారు.నక్కలగండి రిజర్వాయర్ ఎస్ఎల్బీసీలో అంతర్భాగంగా నక్కలగండి బ్యాలెన్సడ్ రిజర్వాయర్ ద్వారా ఏడు టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టిన భూసేకరణ పనులు పూర్తి కావస్తున్నాయన్నారు.ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోయిన నక్కలగండి తండా రైతులకు పండ్ల తోట చెట్లు కోల్పోయిన కొంత మంది రైతులకు నేటి వరకు నష్టపరిహారం అందలేదని విమర్శించారు.రిజర్వాయర్ కింద కిలోమీటర్ల లోపే మోతే, కేశతండా ఉన్నప్పటికీ వాటిని పునరావాస ప్యాకేజీలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.నార్కట్‌పల్లి పరిధిలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం 2007లో ప్రారంభించి రూ.699 కోట్ల అంచనాతో ప్రారంభించిన సగం పనులే పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తి చేయాలని కోరారు.మిగిలిన ప్రధాన కాలువలు ఉప కాలువలు, భూసేకరణకు మరో రూ.500 కోట్ల నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని సూచించారు.డిండి రిజర్వాయర్ 2005 ప్రారంభి ంచారన్నారు.తర్వాత 2015లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దీన్ని చేర్చి ఏదుల రిజర్వాయర్ నుండి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని, అటు వట్టెం రిజర్వాయర్ ద్వారా ఇప్పుడు ఎక్కడ అనేది నిర్ధారణ లేక ప్రజల ఆశలు ఆవిరై ఉన్నాయని గుర్తు చేశారు ప్రభుత్వం వెంటనే మొదటి నిర్ణయం ప్రకారం ఏదుల రిజర్వాయర్ నిర్మాణం చేసి రూపొందించి పనులు ప్రారంభించాలని ఈ ప్రాజెక్టు కింద సింగరాజుపల్లి గొట్టుముక్కల కష్ణరాయపల్లి చర్లగూడెం రిజర్వాయర్ పనులు సాగుతాయని కింద ముంపు గ్రామాల రైతులకు పునరావాస ప్యాకేజీ అందించి పనులు పూర్తి చేయాలని దశాబ్దకాలంలో ఉన్న ప్రాజెక్టులను తీవ్ర జాప్యం జరగడం వలన వెనుకబడ్డతోనే పనులు పూర్తి కాలేని పరిస్థితి నెలకొన్నదన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య,తుమ్మలవీరారెడ్డి,సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, డబ్బికార్మల్లేశ్, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు ఉజ్జినియాదగిరిరావు, ఉజ్జిని రత్నాకర్‌రావు ఉన్నారు.