Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ-దేవరకొండ
సమాజంలో సగభాగంగా నున్న మహిళల హక్కుల రక్షణ కోసం ఐకమత్యంతో కలిసి పోరాడదామని ఐద్వా జిల్లా ప్రధానకార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలో జరిగిన ఆ సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు.నేడు పసిబిడ్డ నుండి 90 ఏండ్ల పండు ముసలి వరకూ అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు.దీనికి ప్రధాన కారణం అశ్లీలత, సెల్ ఫోన్లు, మద్యం ప్రధాన కారణమని భావిస్తున్నామన్నారు.దేశంలో కొన్ని రాష్ట్రాలలో మహిళలు జీను ప్యాంటు వేసుకున్నదని చంపేశారని, ఒంటరిగా వెళ్లినా బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడడం, ఆ తర్వాత హత్య చేయడం పరిపాటిగా మారిందన్నారు.ఎన్నో చట్టాలున్నప్పటికీ చట్టాలలోని లొసుగులతో తప్పించుకుతిరుగుతున్నారన్నారు.ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఘటన జరిగిన మూడు నెలలలోపే శిక్షలు కఠినంగా విధించాలని డిమాండ్ చేశారు.మహిళలకు విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.మహిళలకు సంక్షేమపథకాలు అమలు జరగడం లేదని, డ్వాక్రా పొదుపు సంఘాల పేర తీసుకున్న అప్పులకు అధిక వడ్డీలు వేసి నడ్డివిరుస్తున్నారన్నారు.ఐద్వా ఆధ్వర్యంలో గ్రామస్థాయినుంచి పటిష్ఠ కమిటీలు వేసుకొని పెద్దయెత్తున ఉద్యమాలలోకి, పోరాటాల్లోకి మహిళలు రావాల్సిందిగా కోరారు. త్వరలో జిల్లా, రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, మహాసభల్లో పోరాట కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అనంతరం 15 మందితో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షురాలుగా జంపాల పద్మ, మండల కార్యదర్శిగా నిమ్మల పద్మ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నిమ్మలపద్మ, జిల్లా కమిటీ సభ్యురాలు తోట రమణ, జంపాల పద్మ, పగడాల సుధా, లంకలపల్లి రమణ, గోదావరి, అనిత, సుజాత, ఎమ్‌డి. జహంగీర్‌బీ, భూతరాజు పద్మ, లంకలపల్లి కళమ్మ పాల్గొన్నారు.