Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి
చౌటుప్పల్: దక్షిణ తెలంగాణ మీద సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం పట్టణ కేంద్రంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మూలంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందన్నారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని వైద్యం, విద్యలో బీసీలకు 27శాతం, ఈడబ్ల్యుఎస్‌లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాక ముందే దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు పండ్లు, బ్రెడ్, జ్యూస్ ప్యాకెట్లు పంపిణీచేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, మండల అధ్యక్షులు రిక్కల సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు కాయితి రమేశ్‌గౌడ్, బాతరాజు సత్యం, కౌన్సిలర్లు పోలోజు శ్రీధర్‌బాబు, ఆలె నాగరాజు, నాయకులు శాగ చంద్రశేఖర్‌రెడ్డి, ఉడుగు యాదయ్యగౌడ్, కడవేరు పాండు, కంచర్ల గోవర్థన్‌రెడ్డి, రాధారపు సత్తయ్య, చినుకని మల్లేశం, బడుగు కష్ణ పాల్గొన్నారు.