Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందుబాబులకు అడ్డాగా మారిన డబుల్బెడ్రూం ఇండ్లు
- పెరిగిన కంపచెట్లు, పలిగిన కిటికీలు, ఊడిన తలుపులు
నవతెలంగాణ-పెన్ పహాడ్
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పథకం ఉద్దేశం బాగానే ఉన్నా అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో మండల పరిధిలోని చీదేళ్ల గ్రామంలో నిర్మించిన ఇండ్లు పంపిణీకి నోచక శిథిలావస్థకు చేరుకున్నాయి. మండల పరిధిలోని చీదేళ్ల గ్రామంలో 126 ఇండ్లు మంజూరయ్యాయి. వీటికి 2016లో మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకూ పంపిణీకి నోచలేదు. నిర్మించిన ఇండ్ల చుట్టూ కంప చెట్లు పెరిగి పోయాయి. ఇండ్లను తాగుబోతులు అడ్డాగా మార్చుకున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఇండ్లు ప్రారంభానికి ముందే పగుళ్లు వచ్చాయి. కొన్ని ఇండ్లకు కిటికీలు పగిలి, తలుపులు ఊడిపోయాయి. మరికొన్నింటికి పగుళ్లు, బీటలు వచ్చాయి. గదులకు నేటికీ విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. నిర్మించిన వాటికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని, లబ్దిదారులను ఎంపిక చేసి వాటిని పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.