Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సేవ్ఇండియా నినాదంతో ఆగస్టు 9 క్విట్ ఇండియాడే వరకు దశలవారీ నిరస నోద్యమం చేపట్టాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దండెంపల్లి సరోజ, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కుంభం కష్ణారెడ్డి కోరారు.సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ప్రతి నిధులకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్ర మంలో భాగంగా సోమవారం కౌన్సిలర్లు బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేశ్, బొడ్డుపల్లి లక్ష్మీలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయాన్ని సర్వనాశనం చేసేలా సాగు చట్టాలు తెచ్చిందని విమర్శి ంచారు.ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలుగా రైతాంగం పెద్దఎత్తున పోరాడుతున్నా కేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరి స్తోందని విమర్శించారు. అంబానీ,అదానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు రైతుల వ్యవసాయ భూములను కట్టబెట్టేందుకు ఈ చట్టాలు తెచ్చారని చెప్పారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర చట్టాల వలన వ్యవసాయం మరింత సంక్షోభంలో కూరుకు పోయి రైతాంగం తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పోలే సత్యనారాయణ, ఊట్కూరు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.