Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య
నవతెలంగాణ-డిండి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మూలంగా దేశంలో నిరుపేదలకు విద్య, వైద్యం రోజురోజుకు అందని పరిస్థితి ఏర్పడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య విమర్శించారు.మంగళవారం మండలకేంద్రం,బొగ్గులదోని గ్రామాల్లో నిర్వహించిన పార్టీ మహాసభలనుద్దేశించి మాట్లాడారు.కరోనా కష్టకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి నివారణచర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు.ఈ కాలంలో పాఠశాలలు మూతపడడం వల్ల కూలీల పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయని స్థితి ఉందన్నార.ఇంటర్నెట్ లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులు వినలేదని మూలంగా చదువులకు దూరమయ్యరని తెలిపారు.ప్రైవేటీకరణ విధానాల వల్ల అనేక పరిశ్రమలు మూతపడడంతో ఉన్న ఉద్యోగాలు పోయి ఉఫాదిని కోల్పో యారన్నారు.కోట్లాది మంది వీధినపడ్డారన్నారు.మోడీ ప్రభుత్వం ఎల్ఐసీ, బ్యాంకుల ప్రయివేటీకరణ చేయాలని పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడం సిగ్గుమాలిన చర్య అన్నారు.ఆ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ ఎన్నికల కు ముందు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలలో జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్, నాయకులు నల్లా వెంకటయ్య, బుషిపాకవెంకటయ్య, పి.బుచ్చయ్య నిరంజన్, చింతం వెంకటయ్య, పంది లూతమ్మ, కొమ్ము జగతయ్య, బుషిపాక రాములు, దున్న లింగయ్య, పోలరాజు వెంకటయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు. అనంతరం డిండి (గుండ్లపల్లి) గ్రామ కార్యదర్శిగా బుషిపాక వెంకటయ్య,బొగ్గులదోని గ్రామకార్యదర్శిగా పంది లూతమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.