Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల అసోసియేషన్‌కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్‌ను కలిసి సన్మానించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని వాణిజ్యపరంగా అభివద్ధి చేయాలని అందుకు తన సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు.నూతన కార్యవర్గం అసోసియేషన్ అభివద్ధికి పాటుపడాలని సూచించారు.వ్యాపార వాణి జ్యాలతో పాటు సామాజిక సేవారంగాల్లో భాగస్వాములు కావాలని కోరారు.అసోసియేషన్ భవనానికి స్థలం మంజూరు చేసేందుకు కషి చేస్తానన్నారు. అనంతరం అసోసియేషన్‌కు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఈదా నాగిరెడ్డిని పూలమాలలు,శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఈద .నాగిరెడ్డి ఉపాధ్యక్షులు చాప గోవిందరావు, ప్రధాన కార్యదర్శి కొత్త రాజారావు, కోశాధికారి అర్వపల్లి వెంకటశివశంకర్, సహాయ కార్యదర్శి గునుగుంట్ల సాయి,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందునాగేశ్వరరావు, చింతల వీరయ్య, వెంపటి మధుసూదన్,గట్ల కోటేశ్వరరావు, మల్లికార్జున్, గునుగుంట్లరఘు, చింతలరాముడు పాల్గొన్నారు.