Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కోటాచలం
నవతెలంగాణ-అర్వపల్లి
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని డీఎంహెచ్ఓ కోటాచలం అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజు వారీగా మండల ప్రజలకు అందచేస్తున్న వ్యాక్సిన్ వివరాలను కూడా పరిశీలించారు.ఆశాకార్యకర్తలు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.వైద్య సిబ్బంది అన్ని గ్రామాల్లోనూ కరోనాటెస్టులు చేయాలన్నారు.షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు గుర్తించి రోజువారీ మందులను అందించాలని ఆదేశించారు.గ్రామాల్లో రోజువారీగా సర్వే చేయా లన్నారు.అదేవిధంగా క్షయవ్యాధిగ్రస్తులకు మందులను అందించాలన్నారు.ఆశావర్కర్స్, వైద్యసిబ్బంది గ్రామాల్లో నిర్వహించే అన్ని రకాల పరీక్షలు చేయాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రజలు రోగాలను రోగాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారి నవీన్, సీహెచ్ఓ చరణ్, అంజయ్య, శ్రీనివాస్, ఆశావర్కర్స్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.