Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ కీచక ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి చేతిలో బలాత్కారానికి గురైన దళిత ట్రైనీ ఎస్సైకి తగిన న్యాయం చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని దళిత, బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ దళిత మహిళా ట్రైనీ ఎస్సైని విధుల నెపంతో ఫారెస్టులోకి తీసుకొని వెళ్లి బలాత్కారం చేసిన ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని, శాంతిభద్రతలు కాపాడాల్సిన వారే సభ్య సమాజం తలదించుకునేలా చేయడం సిగ్గుచేటన్నారు. ఒక మహిళా ఎస్సైకే భద్రత లేకుంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో గంటా రాంబాబు యాదవ్, దళితసంఘాల నాయకులు ఉబ్బపల్లి శంకర్, కందికంటి నగేష్, కొత్తపల్లి వెంకటేష్ పాల్గొన్నారు.