Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్యాలగూడ అద్దె భవనంలో కొనసాగుతున్న వైనం
- నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
నవతెలంగాణ-పెద్దవూర
ప్రభుత్వం నిర్లక్ష్యం ,అధికారుల అల సత్వం, కారణంగా మండలకేంద్రంలో నిర్మాణం పూర్తై రెండేండ్లవుతున్నా గిరిజన బాలుర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభానికి నోచలేదు.రూ.4.50 కోట్ల వ్యయంతో మండల కేంద్రం లోని పినవూర రహదారిలో సర్వే నెం.609లో 6.03 ఎకరాల్లో మొత్తం 32 గదులతో నిర్మించిన సొంతభవనం ప్రారంభానికి నోచుకోని పరిస్థితి ఉంది.అన్ని రంగు,హంగులతో ముస్తాబైంది.మిషన్‌భగీరథ పైపులైన్ పనులు పూర్తయ్యాయి.అయినప్పటికీ అద్దెభవనంలో రెండేండ్లుగా మిర్యాలగూడెంలో ఉన్నత అధికారులు నడిపిస్తున్నారు.2016లో నూతన తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దవూరలో ఏర్పాటు చేశారు.అప్పట్లో నిర్మాణం ఆలస్యం కావడంతో విద్యార్థులను దేవర కొండకు, తరలించారు.అక్కడవసతులు బాగలేక హాలియాకు ,అక్కడినుంచి మిర్యాల గూడ అద్దె భవనంలోకి మార్చారు.అద్దె భవనానికి ఒక నెలకు ఒక రూ.1,60,000 ప్రభుత్వం అద్దె ఇస్తున్నది.పూర్తయిన ప్రారంభించక పోవడంతో ఏడాదికి రూ.19,20,000 అద్దె చెల్లిస్తుండడంతో ప్రభుత్వ ఆదా యానికి భారీగా గండి పడుతుంది.అంతే కాక ఇక్కడ ఉన్న విద్యార్థులు మిర్యాలగూడెంలో వెళ్లి విద్యను అభ్యసిం చాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.అయినప్పటికీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పెద్దవూరలో నూతనభవనం ప్రారంబించి ఆన్లైన్ తరగతులు ప్రారంభి ంచాలని పలుగిరిజన విద్యార్థిసంఘాలు, ప్రజలు, విద్యా ర్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నారు.