Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
మోత్కూరులో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తక్కువ వస్తుందన్న సాకుతో ఇక్కడి నుంచి ఎత్తివేసేందుకు ఆలోచన చేస్తుందని, వెంటనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మోత్కూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగించాలని కోరూతూ ఆ సమితి ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోత్కూరుతో పాటు ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యం ఉందని, మోత్కూర్ మున్సిపాలిటీ గా ఏర్పడినందున ఆదాయం కూడా బాగా వస్తుందన్నారు. కార్యాలయం రద్దు చేస్తే 50 కి.మీ దూరంలో ఉన్న భువనగిరి, యాదగిరిగుట్ట కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అనంతరం ఇన్‌చార్జ్జి సబ్ రిజిస్ట్రార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలడుగు ఉప సర్పంచ్ ఎడ్ల భగవంత్, నాయకులు నిలిగొండ మత్స్యగిరి, చోల్లేటి సోమేశ్ , బయ్యని గిరిప్రసాద్, మహ్మద్ ఖలీల్, కొంపల్లి గోరయ్య, బయ్యని నర్సింహ్మ, ప్రసాద్ ,వెంకన్న పాల్గొన్నారు.