Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొమ్మలరామారం : మండలం లోని తూదులకంటి గూడెం చెక్‌డ్యాం మరమ్మతులు, కాజ్వే, మేడిపల్లి మెట్రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మర్యాలలో గ్రామ అభివద్ధి కమిటీ సభ్యులు మంగళవారం హైదరాబాదులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కుషాయిగూడ నుండి భువనగిరికి వయా మర్యాల బస్సును పునరుద్ధరించాలని కోరారు. స్పందించిన ఆమె ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. రజక సంఘం భవనానికి లక్ష రూపాయలు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మన్నె శ్రీధర్ ,సంధ్యగల్ల పెద్దులు, కూరాకుల యాదగిరి, మచ్చ దయానంద్, దేశెట్టి లక్ష్మీనారాయణ, అన్నారం లక్ష్మయ్య, ఈదులకంటి రామకష్ణారెడ్డి, జట్టా మల్లేశం, కాటం ఐలేష్ కుమార్, వడ్లకొండ సుదర్శన్, మచన్న గారి చంద్రారెడ్డి, కోడి మాల బాల్ రెడ్డి, వడ్లకొండ రమేష్, ఈదులకంటి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.