Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
నవతెలంగాణ-తుర్కపల్లి
నేడు మండలంలోని వాసాలమర్రికి సీఎం కేసీఆర్ 11 గంటలకు వస్తున్నట్టు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.మంగళవారం గ్రామాన్ని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో గ్రామస్థులతో సభ నిర్వహించి, సహపంక్తి భోజనం చేసిన మరో 20సార్లు వాసాలమర్రికి వస్తానని ప్రకటించారు. ఇంతకుముందు గ్రామ పర్యటనకు సిద్ధమైన అనివార్యకారణాలవల్ల వాయిదా పడింది. దళితవాడలో సీఎం పర్యటించి రైతు వేదికలో వేదిక ప్రాంగణంలో నూట 120మంది సభ్యులతో సమావేశం కానున్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తమై ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ నారాయణ రెడ్డి,ఏసీపీ కోట్ల నర్సింహ రెడ్డి, డీఆర్డీఓ ఉపేందర్ రెడ్డి,జెడ్పీ సీఈఓ కష్ణ రెడ్డి, ఆర్డీఓ భూపాల్ రెడ్డి, సీఐ నర్సింహ, సర్పంచ్ పొగుల అంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్,తహసీల్దార్ జ్యోతి,ఎంపీడీఓ ఉమాదేవి,వివిధ శాఖల అధికారులు ఉన్నారు.