Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, గ్రామీణ పేదల , దేశ వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. వ్యకాస, సీఐటీయూ, రైతు సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా మండల పరిధిలోని బస్వావపురం సర్పంచ్ కస్తూరి మంజుల , ముత్తిరెడ్డిగూడం సర్పంచ్ మాకొల్ల సత్యం, పంచాయితీ కార్యదర్శి శేఖర్‌లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను, లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రజావ్యతిరేక విద్యుత్ చట్టా సవరణ ఆపాలని, ఉపాధి కార్మికులను కులాల విభజనను విరమించుకోవాలని, డిమాండ్ చేశారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కష్ణ, వ్యకాస నాయకులు రాసాల వెంకటేశం, కొండ అశోకు, మధ్యపురం బాల్ నరసింహ, నరాల చంద్రయ్య, చిక్కుల చంద్రమౌళి, మచ్చ జహంగీర్, వనగంటి బాలస్వామి, కొండ నందు, ఎలసాని శ్రీశైలం, కొండమడుగు చంద్రయ్య పాల్గొన్నారు.