Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్గొండ
ఈ నెల 6న పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న ఎస్సీల సమగ్రాభివృద్ధి సాధన సదస్సును జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కో- ఆర్డినేటర్ యాతకుల రాజయ్య , ఎంఎస్ఎఫ్్ జాతీయ అధ్యక్షులు రుద్రావరం లింగుస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో దళితులను మోసం చేస్తూనే కాలం వెళ్లదీస్తూ వచ్చారన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన దళిత జాతిని ఎప్పటికప్పుడు ఓట్ల కోసం తన మాటలగరాడితోమోసం చేస్తున్నారని ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూపంపిణీ, డబుల్బెడ్రూం ఇండ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఉచిత విద్య వంటి హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఈ నెల 6న జరిగే సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకష్ణ ,మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ హాజరుకానున్నట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో దోంబరా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నపురి నగేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆడెపు నాగార్జున, మేడి శంకర్, ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్, కొమిరెస్వామి, ఏపూరి రాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు పెరిక శ్రీనివాసులు, స్వప్న, దేవయ్య, చిలుముల జలంధర్ గడుసు సైదేశ్ తదితరులు పాల్గొన్నారు.