Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సాంబమూర్తి
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి నియోజక వర్గాన్ని అభివద్ధి దిశగా నడిపిస్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఏఐఎఫ్బీ నాయకులు గండ్ర సత్యనారాయణరావు విమర్శించడం సిగ్గుచేటని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. మొగుళ్లపల్లి మండలం అమ్మ గార్డెన్స్‌లో ప్రతిపక్ష పార్టీ నాయ కుడు సత్యనారాయణరావు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నా మన్నారు. సత్యనారాయణ రావు మాటలు వింటే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని ఎద్దేవా చేశారు. పార్టీలు మారుతున్న సత్యనారాయణ ఎమ్మెల్యే రాజీ నామా చేయాలనడం సరికాదన్నారు. భూపాలపల్లి అభివద్ధికి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు, అమలు చేయాలనే దఢ సంకల్పం, తెలంగాణ నవనిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే తపనతో టీఆర్ఎస్లోకి వచ్చారని అనానరు. ఏఐఎఫ్‌బీలో ఉంటూ స్వతంత్ర అభ్యర్థిగా చెప్పుకుని తిరుగుతున్న సత్యనారాయణకు ఎమ్మెల్యేను విమర్శించే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ చేరుతానని ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకోకుండా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఏఐఎఫ్బికి ద్రోహం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీ నాయకులకు ఇష్టం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మెన్ కొత్త హరి బాబు, కౌన్సిలర్లు ముంజల రవీందర్ గౌడ్, శిరుప అనిల్, నాయకులు పాల్గొన్నారు.