Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మొదటిదశలో 2 కోట్లతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన నేత
- పేద ప్రజల నేస్తం...అనిల్ అన్న
నవతెలంగాణ- భువనగిరిరూరల్
కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది పేదలకు ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించి, భువనగిరి జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు ఆపద్బాంధవుడయ్యాడు అనిల్ అన్న. యువజన కాంగ్రెస్ సహకారంతో హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేయలేని వారికి 'నేనున్నాను' అంటూ అండగా ఉంటూ వారికి కావాల్సిన సహకారాన్ని అందించిన గొప్ప నేత కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
కరోనాలోనూ కరుణ...
కరోనా సమయంలో జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి ఆస్పత్రికి రావడానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో పేద ప్రజల బాధల గురించి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ ఏర్పాటుతో 24 గంటల పాటు యూత్ కాంగ్రెస్ సహకారంతో పేద ప్రజలను సకాలంలో ఆస్పత్రికి చేర్చి వారి ప్రాణాలను రక్షించారు. జిల్లాలోని భువనగిరి పట్టణం, రూరల్ తో పాటు, పోచంపల్లి ,చౌటుప్పల్, ఆలేరు, బొమ్మలరామారం, అడ్డగూడూరు, మోత్కూర్తో పాటు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలను అందించారు. ఆక్సిజన్ లేని సమయంలో డీలర్ల తోటి స్వయంగా మాట్లాడి సొంత డబ్బులతో కొనుగోలు చేసి పేద ప్రజలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. పేదల పాలిట ప్రాణదాతగా నిలిచారు.
పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం
పేద ప్రజలకు తన హాస్తంను అందించి ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాలకు చేదోడువాదోడుగా సహకారం అందించారు. గతంలో వలిగొండ మండలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మతి చెందిన సభ్యులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. నల్గొండకు చెందిన సాక్షి రిపోర్టర్ గిరిబాబు కుటుంబానికి రూ. 50వేల ఆర్థిక సహాయం అందించారు.బీబీనగర్ మండలం నేమర గోముల గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోగా వారికి ఆర్థిక సహకారం అందజేశారు.
ఎయిమ్స్ కోసం ఏడువేల మందితో పాదయాత్ర
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి తలమానికమైన ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని, ఎయిమ్స్ అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావాలని కోరుతూ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం పాదాలవరకు సుమారు 24 కిలోమీటర్ల పాదయాత్రను ఏడు వేల పైచిలుకు మందితో నిర్వహించారు. ఎయిమ్స్ ఏర్పాటు కోసం ఎంతో కషి చేశారు.
కరోనా మొదటి దశలో రూ.2 కోట్లతో నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనా మొదటి దశలో పేదలకు రూ.2 కోట్లతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనేక మందికి అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు రోగులకు సేవలందించేందుకు కరోనా కిట్స్ పంపిణీ చేశారు.
జిల్లా సమస్యలపై అలుపెరుగని పోరాటం
యాదాద్రి భువనగిరి జిల్లా అభివద్ధి చెందాలంటే సాగు, తాగునీరు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ అనేకమార్లు అధికారులకు విన్నవించినా స్వయంగా అనిల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. బునాదిగాని కాలువ పూర్తి చేయాలని కోరుతూ పలుమార్లు దీక్షలు చేపట్టారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కరోనా మొదటి, రెండవ స్టేజీలలో పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు, వారికి కావాల్సిన సహకారాన్ని యువజన కాంగ్రెస్ సహకారంతో అంబులెన్స్ ఏర్పాటు చేసి 24 గంటల వైద్య సేవలు అందించిన ఘనత ఆయనకు దక్కింది. అనేక పేద మంది పేద ప్రజలకు ఆక్సిజన్ అందించారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పార్టీ ల జోలికి వెళ్లకుండా అవసరం ఉన్న వారి వెంటే ఉంటూ వారికి కావాల్సిన సహకారాన్ని అందించారు. సామాజిక సేవలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
పదల కోసం మెడికల్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తాం
డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
పేద ప్రజలు రోగాల బారిన పడినప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక సరైన సౌకర్యాలు లేని ప్రైవేట్ హాస్పిటల్లో చేరి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా వారికి సరైన వైద్యం అందడం లేదు. వారి కోసం జిల్లా వ్యాప్తంగా మెడికల్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాదులోనే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ , నిమ్స్‌లో వైద్య సౌకర్యం అందేలా మెడికల్ కన్సల్టెన్సీ ద్వారా పేద ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇచ్చి వారికి సంబంధిత జబ్బుకు ఆస్పత్రికి వెళ్లేలా చర్యలు చేపడ్తాం.