Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్గొండ: కరోనా కష్టకాలంలో ప్రజలకు పనులు లేక బ్యాంకుల్లో రుణాలు కట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతి మహిళకు లక్ష వరకు డ్వాక్రా రుణాలను రద్దు చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. బుధవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో ఆ సంఘం నల్లగొండ మండల మహాసభ నిర్వహించారు. ఐద్వా జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రభావతి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలతో కనీసం పౌష్టిక ఆహారం తినలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్నారు. అధిక ధరలను తగ్గించాలని అన్నారు.పంటలు పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదని, కార్మికుడికి వేతనం లేదని అన్నారు. పెట్టుబడిదారులకు దోపిడీ చేసే విధానాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.నేడు మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు ఆగడం లేదని ఎన్నో చట్టాలున్నప్పటికీ పకడ్బందిగా అమలు కాక పోవడం వలన తప్పించుకొని దోషులు యథేచ్ఛగా ఘాతుకాలకు పాల్పడుతున్నారని అన్నారు.అనంతరం నల్లగొండ మండలం నూతన కమిటీ 15 మందితో ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా పందెనపల్లి సైదమ్మ ప్రధాన కార్యదర్శిగా కొండ అనురాధ సహాయ కార్యదర్శిగా గోలి వెంకటమ్మ, వరమ్మ ఉపాధ్యక్షురాలుగా నాంచారమ్మ నాగమణి ,పదిహేనుమంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. మహాసభలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండా అనురాధా జిల్లా కమిటీ సభ్యురాలు తంతనపల్లి సైదమ్మ గోలి వెంకటమ్మ , నాంచారమ్మ సరోజ సునీత పద్మా రాములమ్మ నాగలక్ష్మి వసంత పాల్గొన్నారు.