Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ- ఆలేరుటౌన్
నిరుద్యోగులకు భతి ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్ అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తుంగలో తొక్కిందన్నారు. జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు మోరిగాడి రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి చెన్న రాజేష్, పట్టణ అధ్యక్షుడు ఎలుగల శివ, మండల అధ్యక్షులు భీమగాని సాయికుమార్, కోశాధికారి మొగిలిపాక కష్ణ, పట్టణ ఉపాధ్యక్షుడు భువనగిరి గణేష్, వడ్డెమాన్ విప్లవ్, మండల సహాయ కార్యదర్శి గడ్డమీది ప్రశాంత్, నాయకులు రేగటి ప్రశాంత్ తెరాల రమేష్, కందాడి మాధవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.