Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి రూరల్
కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక వ్యవసాయ చట్టాలను లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. వ్యకాస, రైతు సంఘం, సీఐటీయూ ఆలిండియా కమిటీల పిలుపులో భాగంగా బుధవారం ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన, అనాజిపురం సర్పంచ్ ఏదునూరి ప్రేమలత, నమాత్ పల్లి సర్పంచి ఎల్లాంల శాలిలకు వినతి పత్రాం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికి నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చిందన్నారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ లేబర్ కోడ్స్‌గా విభజించి కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు. ఉపాధి హామీ కి బడ్జెట్లో నిధులు కేటాయించి సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా పేరుతో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఏదునూరి మల్లేష్, కొండాపురం యాదగిరి, ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు బొల్లెపల్లి కిషన్, నాయకులు ఎల్లాంల వెంకటేష్, జంగయ్య, ఐతరాజు కిష్టయ్య పాల్గొన్నారు.