Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజాపేట : ఈ నెల 8న నల్లగొండలో నిర్వహించనున్న హలో బహుజన..చలోనల్లగొండ పోస్టర్ను బుధవారం మండలకేంద్రంలో బీఎస్పీ నాయకులు భూపతి మోహన్ ఆవిష్కరించారు. అనంతరం స్థానిక గెస్ట్ హౌస్లో మోహన్ విలేకర్లతో ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత బహుజనులకు రాజ్యాధికారం అందించే దిశగా తన పదవిని తణప్రాయంగా వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారన్నారు. నాయకునిగా, రాజకీయ ప్రక్షాళన కోసం, దళిత బహుజనుల ఏకీకరణ దిశగా సాగే ప్రయాణంలో మేధావులు కవులు, కళాకారులు బహిరంగసభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతంచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో.మండల నాయకులు, కొమ్ము ప్రకాష్, అరుణ్ కుమార్,రవి, అశోక్, గణేష్, క్రిష్ణ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.