Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
లయన్స్ క్లబ్ సభ్యులు సామాజిక సేవా దక్పథంతో పనిచేయాలని, సామాజిక సేవలకు నిలయం లయన్స్ క్లబ్ అని లయన్స్ క్లబ్ జనగాం జిల్లా గవర్నర్ ముచ్చ రాజిరెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ మోత్కూర్ శాఖ ప్రారంభోత్సవం, నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం మంగళవారం రాత్రి ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు ఉచిత వైద్య శిబిరాలు,కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సామాజిక సేవలో ముందున్నారని కొనియాడారు. అనంతరం లయన్స్ క్లబ్ చార్టర్ ను లయన్స్ క్లబ్ మోత్కూర్ నూతన అధ్యక్షుడు ఎగమాటి రాంరెడ్డి, కార్యదర్శి ఎదుళ్ల సుధీర్ రెడ్డి, కోశాధికారి సోమ వెంకటేశ్వర్లుకు జిల్లా గవర్నర్ రాజిరెడ్డి చేతుల మీదుగా అందజేసి నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. రూ.30 వేల కాంట్రిబ్యూషన్ ను అధ్యక్షుడు ఎగమాటి రాంరెడ్డి అందించగా మోత్కూర్ బ్రాంచికి రూ.75 వేల విలువ కల్గిన బాడీ ఫ్రీజర్ను అందజేశారు. దాచారంలో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారిన మాదిరెడ్డి మానసకు చైర్మెన్ రాంరెడ్డి రూ.10 వేలు అందజేశారు. కొప్పుల కరుణాకర్ రెడ్డి రూ.11 వేలను రోడ్డు ప్రమాదంలో మతిచెందిన కూరపాటి సాగర్ తండ్రి సత్తయ్య కు అందజేశారు. కంచనపల్లి కి చెందిన గొడిశాల విజయ భర్త ఇటీవల కరోనాతో మతిచెందగా రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేగారెడ్డి, జిల్లా మాజీ గవర్నర్ గోవిందరాజు, టి. లక్ష్మీనర్సింహారావు, కన్నా పరుశరాములు, రీజియన్ అడ్వయిజర్ కాసం అంజయ్య, రీజియన్ చైర్ పర్సన్ ఈదుల ప్రతాప్ రెడ్డి, జోన్ చైర్ పర్సన్ టి.కష్ణారెడ్డి, ఎక్సటెన్షన్ చైర్మెన్ ఎడమ సంజీవరెడ్డి, గైడింగ్ లయన్ క్రిష్ణజీవన్ బజాబ్, జనగామ క్లబ్ చైర్మెన్ జైన రమేష్, మోహన్ రెడ్డి, మోత్కూర్ క్లబ్ సభ్యులు గోరుపల్లి సంతోష్ రెడ్డి, పి.రమేష్, జి.రామచంద్రు, జంగ శ్రీను, సుధగాని పాండు, సమీర్, వెంకన్న, సోమిరెడ్డి, నర్సిరెడ్డి, సోంబాబు, తండ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.