Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి విలువలు పెరగడంతో పేటలో తరచూ వివాదాలకు దారి తీస్తున్న వైనం
- అధికారుల నిర్లక్ష్యంతో మనోవేదనకు గురవుతున్న భూబాధితులు
నవతెలంగాణ-సూర్యాపేట
భూమి విలువలు పెరగడంతో సూర్యాపేటలో తరచూ వివాదాలకు దారి తీస్తున్నాయి.దీంతో బాధితులు కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో తమ కుటుంబ సభ్యుల మంతా ప్రతిరోజూ తీవ్ర మనోవేదనకు గురౌతున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు.ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితురాలు రసూల్‌బీ బుధవారం కన్నీరు మున్నీరయ్యారు.జిల్లాకేంద్రంలోని ఆమె నివాసంలో విలేకర్లతో మాట్లాడారు.జిల్లాకేంద్రంలో భూ సమస్యలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బేచిరాగ్ మాదారం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 58 లో 30 గంటల విస్తీర్ణం గల భూమి పట్టణానికి చెందిన షేక్ రసూల్‌బి తన తండ్రి వారసురాలిగా వారసత్వ ఆస్తి కోసం 1998లో సూర్యాపేట సివిల్ కోర్టును ఆశ్రయించారన్నారు.ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన సివిల్‌కోర్టు ఓఎం నెంబర్ 8 /19 98 ద్వారా స్వాధీన యాజమాన్యం ఫైనల్ డిగ్రీ ఏఐ నెంబర్ 526 /2014 ఓ.ఎస్ నెంబర్ 8 /1998 గుర్తించి భూమి హక్కులు కల్పించాలని తీర్పునిచ్చిందని స్పష్టం చేశారు.కోర్టు తీర్పు ఇచ్చిన దగ్గర నుండి ఆ భూమిపై రసూల్బితో పాటు ఆమె కుమారులకు హక్కుగా ఉన్నప్పటికీ జిల్లాలోని పలు మండలాలకు చెందిన మంచికంటి హనుమంతరావు, మంచికంటి నర్సింహారావు, మేకల శ్రీనివాస్,గడ్డం మల్లారెడ్డి ,ఏనుగు రాజిరెడ్డి, కాసం సురేష్, మంచికంటి హనుమంతరావు,పడదల శ్రావణ్, పన్నాల సుజాతలు తమకు అదే భూమిపై హక్కు ఉందని తమ కుమారులతో వాగ్వివాదానికి దిగుతున్నట్టు తెలిపారు.ఈ విషయమై 9 మంది వ్యక్తులు కోర్టును ఆశ్రయించారని, అందుకు తాను కూడా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కేసు వివరాలను పరిశీలించి 9 మంది వ్యక్తులు వేసిన పిటిషన్‌ను కోర్టు తొలగించినట్టు వివరించింది.కోర్టులో వారి పిటిషన్‌ను తొలగించినప్పటికీ అంతటితో ఆగకుండా మంచికంటి హనుమంతరావుతో పాటు పలువురు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని చెప్పారు.నిర్మాణాలను ఆపే క్రమంలో తమ కుటుంబసభ్యులతో మంచికంటి హను మంతరావు ఘర్షణనకు దిగుతున్నట్టు ఆరోపించారు.తమ స్థలంలో ఇతరులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆమె మీడియా ముందు కంటతడి పెట్టారు.విద్యుత్ శాఖ అధికారులు కూడా నకిలీపత్రాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఓ ప్రజాప్రతినిధి వద్ద గల ఓ కీలక వ్యక్తి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ అధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలిపింది.కోర్టు జడ్జిమెంట్ తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇతరులు తమ స్థలంపై అక్రమ నిర్మాణాలను ఇప్పటికైనా ్ల కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఈ స్థలం విషయంలో కొంత మంది వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు భూమి మీద హక్కు లేని వారికి కొమ్ముకాసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.వారి రాకతో ఘర్షణను సష్టిస్తున్నారని తమకు ప్రభుత్వం రక్షణ కల్పించడంతో పాటు తమ భూమిలో ఇతరులు నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించి తమకి స్థలంపై హక్కులు కల్పించాలని రసూల్బితో పాటు ఆమె కుటుంబసభ్యులు వేడుకున్నారు.