Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
పేద ,మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిగేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములుకలపల్లి రాములు విమర్శించారు.బుధవారం మండలంలోని ముకుందాపురం గ్రామంలో పార్టీ గ్రామ మహాసభలలో పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక తప్పుడు నిర్ణయాలను చేసుకుంటూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు.డీజిల్,పెట్రోల్ రేట్లు అమాంతం పెంచిందన్నారు.కులాలవారీగా పనికి ఆహార పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుంటుందని, దీనిని పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు.ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసస్తోందని,పెరిగిన పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్రెడ్డి, నాయకులు పులుసు సత్యం, మండలకార్యదర్శి కల్లెపల్లి భాస్కర్, కార్యకర్తలు పాల్గొన్నారు.