Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగులను ఆదుకోవాలి
నవతెలంగాణ -రామన్నపేట
రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం ఏదో ఒక పథకం పేరుతో ఓట్లు రాబట్టు కోవడానికి ఆరాటం చేస్తుం దని డీివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ విమర్శించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలు వస్తున్నాయనగానే 50వేల ఉద్యోగాల ప్రకటన ఇవ్వడం ఆనవాయితీగా మారిందన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. వెంటనే నిరుద్యోగులకు భతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షులు మెట్టు శ్రవణ్, మండల నాయకులు మునికుంట్ల లెనిన్, మేడి మధుబాబు, దావనూరి ప్రశాంత్, గట్టు మహేష్, గునగంటి మల్లేష్, బెల్లం లింగస్వామి పాల్గొన్నారు.