Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ-చండూరు
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముది రెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని తెరట్ పల్లి గ్రామంలో గ్రామ శాఖ 15వ మహాసభ అచిన్న శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఆ పార్టీ జెండాను మారయ్య ఆవిష్కరించారు. అనంతరం మహాసభలో ఆయన మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు ప్రజల తరఫున నికరంగా పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టు లేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై, గ్రామంలో డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, ఇండ్ల స్థలాల,పెన్షన్స్ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ల ప్రయోజనాలకోసం దేశ సంపదను లూటీ చేస్తుందని విమర్శించారు. ఇందులో భాగంగానే రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చారని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారని ఈ విధానాలు మానుకోకపోతే ప్రతిఘటన పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై నికరంగా పోరాడేది ఎర్ర జెండానే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు బండిశీశైలం , ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా, సిపిఎం మండల కార్యదర్శి బొట్టు శివ కుమార్, ఎఫ్ఏసీఎస్ డైరెక్టర్ అచ్చిన శ్రీనివాసులు, గిరి నరసింహా, అవ్వారి మర్కొండయ, పగిళ్లశ్రీనివాస్, వలూరి శ్రీశైలం, కట్ట శ్రీనివాస్ ,రాములు, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.