Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని 4వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ వార్డు కౌన్సిలర్ చల్లా నాగమ్మ వెంకన్నయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ మండల పరిధిలోని యాద్గార్పల్లి, అవంతీపురం, బాదలాపురం గ్రామాలు, పట్టణంలోని రాంనగర్ శివారులోని వివిధ రైస్‌మిల్లుల పొల్యూషన్ వాటర్‌ను నాల్గో వార్డులోనున్న పెద్దకాల్వలోకి పైపులైను ద్వారా కలుపుటకు రైస్‌మిల్లర్లు ప్రయత్నిస్తున్నారన్నారు.దీని వల్ల చుట్టుపక్కల పట్టణ శివారు చివరి ప్రాంతమైన రాంనగర్, మండలంలోని బాదలాపురం, గూడూరు, కిష్టాపురం, లక్ష్మిపురం, రుద్రారం గ్రామాల ద్వారా ప్రవహించి ఈ కాల్వ చివరగా కృష్ణానదిలో కలుస్తుందన్నారు. ఇన్ని గ్రామాల గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయి అనారోగ్య సమస్యలకు కారణమౌతుందన్నారు. పాడిపశువులు, పంటపొలాలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గ్రామాల పరిధిలోని పెద్దవాగులో 400 వరకూ బోర్లు..అవి కూడా పొల్యూషన్ అయ్యే అవకాశముందన్నారు. ఇట్టి గ్రామాలకు గ్రౌండ్‌వాటర్‌కు ఈ వాగు తప్పితే మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. వార్డులో ఇప్పటికే రైస్‌మిల్లు, డంప్‌యార్డు, ఎస్టీపీ ప్లాంట్‌తో ఇక్కడి ప్రజలు అనేక సమస్యలకు గురవుతున్నారన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి,, పట్టణాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, మండలాధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్ శ్రీనివాస్, సారెడ్డి శంకర్‌రెడ్డి, కౌన్సిలర్లు చల్లా వెంకన్న నాగమ్మ, దేశిడి శేఖర్‌రెడ్డి, గంధం రామకృష్ణ, క్రికెటర్ జాని, ఎమ్‌డి.సలీం, చాంద్‌పాషా, ఎంపీటీసీ రాగిరెడ్డి జగ్గారెడ్డి, రామలింగయ్యయాదవ్, ముల్కలకాల్వ సర్పంచ్ రాజు, నాగరాజు, నరేశ్ ఉన్నారు.