Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాసాలమర్రిలో 1475 మంది పోలీసుల మోహరింపు
- ఇంటింటిని జల్లెడ పట్టి తనిఖీలు
- పల్లె ప్రగతిపై సీఎం ఆగ్రహం
- మండల ప్రజాప్రతినిధులకు నో ఎంట్రీ
- తిండికి పోలీసుల తిప్పలు
నవతెలంగాణ-యాదాద్రి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తత గ్రామం వాసాలమర్రిలో బుధవారం పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఇంటికి ఇద్దరు చొప్పున నిర్వహించిన పోలీసుల బందోబస్తు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాసాలమర్రి దళిత వాడలో 3గంటలకు పైగా సాగిన సీఎం పర్యటనలో దళిత మహిళలు సీఎం నుదుట తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు గ్రామ జనాభాకు ఇంచుమించు సమానంగా బందోబస్తు నిర్వహించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామంలో సుమారు 2,400మంది జనాభా ఉండగా వలసలు పోగా ప్రస్తుతం దాదాపు 1,600 మంది ఉంటున్నారు. ఈ 1600 మంది జనాభాకు గాను 1400 పైచిలుకు పోలీసులు గ్రామంలో మోహరించారు. మోహరించిన పోలీసులు 3న రాత్రే ఇల్లిల్లు తనిఖీలు నిర్వహించి జల్లెడ పట్టారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. గ్రామంలో వీధుల వెంట ప్రజలెవరూ తిరగకుండా కట్టడి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే 144 సెక్షన్ విధించినట్టుగా ఇక్కడి పరిస్థితి తలపించింది.
సీఎం పర్యటన...
రామాలయం దక్షిణ దిక్కున ఉన్న దళితవాడకు చేరుకున్న సీఎం కేసీఆర్ మొక్కలు నాటి దళితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తూర్పు దిక్కున ఉన్న దళితులతో 10 లక్షల దళిత బందు ఎలా సద్వినియోగం చేసుకుంటారు..? అనే విషయాలను అక్కడ దళితులతో పంచుకున్నారు. ఇలా సుమారు 60ఇండ్లల్లో పర్యటించారు. ఈ సమయంలో గ్రామంలోని వీధుల వెంట రోడ్డు పక్కన పెరిగిన గడ్డిని చూసి పల్లె ప్రగతిపై అధ్వానంగా జరిగిందని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులకు అనుమతి లేదు. అదేవిధంగా మీడియా ప్రతినిధులకు కూడా గ్రామంలోకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను మాత్రమే కెసిఆర్ పర్యటనలో అనుమతించారు. ఈ యేడు జూన్ 22న సీఎం కేసీఆర్ సభలో దోస్తుగా ప్రకటించిన చెన్నూరి లక్ష్మి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఆమె కూతురు మమత తనకు ఉద్యోగం కావాలని సిఎంను కోరారు. బీటెక్ పూర్తి చేసిన మమత అభ్యర్థనను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తిరగబడ్డ జనం....
వాసాలమర్రి సమగ్ర అభివద్ధి కోసం గ్రామంలోని 120 మందితో సీఎం కేసీఆర్ రైతు వేడుకలో సమావేశమయ్యారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు తమను కూడా సీఎం సమావేశానికి అనుమతించాలన్న గ్రామస్తులను అక్కడున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగి రైతు వేదిక భవనంలోకి వెళ్లేందుకు పట్టుబట్టారు. కాగా అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో గ్రామాభివద్ధి కోసం వేసిన 7 కమిటీల సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, దళిత ప్రజా ప్రతినిధులను మాత్రమే ఈ సమావేశానికి ఎంపికచేశారు. రాజకీయ పార్టీల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు జనంతో తిరగబడడంతో రైతు వేదిక వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు.
పర్యటనలో సీపీ మహేష్ భగవత్...
ఈ పర్యటనలో భాగంగా రాచకొండ కమిషనరేట్ సీపీ మురళీధర్ మహేష్ భగవత్ వీదుల వెంట ఉన్న గ్రామస్తులు, మీడియా ప్రతినిధులను ఇక్కడి నుంచి తరలించమని తుర్కపల్లి ఎస్ఐ మధుబాబును ఆదేశించారు. కాగా బందోబస్తు లో పాల్గొన్న రక్షకభటులకు మాత్రం తిండికి తిప్పలొచ్చింది. గ్రామంలోని హాస్టల్ భవనంలో ఏర్పాటు చేసిన భోజనాలకు పోలీసులు లంచ్ టైం కు ఒకేసారి భారీగా చేరుకున్నారు. అప్పటికే ఆకలితో నకనక లాడుతున్న పోలీసులు ప్లేట్లతో అన్నం కోసం పోటీ పడ్డారు. మోహరించిన పోలీసులు 3న రాత్రే ఇల్లిల్లు తనిఖీలు నిర్వహించి జల్లెడ పట్టారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. గ్రామంలో వీధుల వెంట ప్రజలెవరూ తిరగకుండా కట్టడి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే 144 సెక్షన్ విధించినట్టుగా ఇక్కడి పరిస్థితి తలపించింది.
సీఎం పర్యటన...
రామాలయం దక్షిణ దిక్కున ఉన్న దళితవాడకు చేరుకున్న సీఎం కేసీఆర్ మొక్కలు నాటి దళితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తూర్పు దిక్కున ఉన్న దళితులతో 10 లక్షల దళిత బందు ఎలా సద్వినియోగం చేసుకుంటారు..? అనే విషయాలను అక్కడ దళితులతో పంచుకున్నారు. ఇలా సుమారు 60ఇండ్లల్లో పర్యటించారు. ఈ సమయంలో గ్రామంలోని వీధుల వెంట రోడ్డు పక్కన పెరిగిన గడ్డిని చూసి పల్లె ప్రగతిపై అధ్వానంగా జరిగిందని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులకు అనుమతి లేదు. అదేవిధంగా మీడియా ప్రతినిధులకు కూడా గ్రామంలోకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను మాత్రమే కెసిఆర్ పర్యటనలో అనుమతించారు. ఈ యేడు జూన్ 22న సీఎం కేసీఆర్ సభలో దోస్తుగా ప్రకటించిన చెన్నూరి లక్ష్మి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఆమె కూతురు మమత తనకు ఉద్యోగం కావాలని సిఎంను కోరారు. బీటెక్ పూర్తి చేసిన మమత అభ్యర్థనను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తిరగబడ్డ జనం....
వాసాలమర్రి సమగ్ర అభివద్ధి కోసం గ్రామంలోని 120 మందితో సీఎం కేసీఆర్ రైతు వేడుకలో సమావేశమయ్యారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు తమను కూడా సీఎం సమావేశానికి అనుమతించాలన్న గ్రామస్తులను అక్కడున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగి రైతు వేదిక భవనంలోకి వెళ్లేందుకు పట్టుబట్టారు. కాగా అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో గ్రామాభివద్ధి కోసం వేసిన 7 కమిటీల సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, దళిత ప్రజా ప్రతినిధులను మాత్రమే ఈ సమావేశానికి ఎంపికచేశారు. రాజకీయ పార్టీల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు జనంతో తిరగబడడంతో రైతు వేదిక వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు.
పర్యటనలో సీపీ మహేష్ భగవత్...
ఈ పర్యటనలో భాగంగా రాచకొండ కమిషనరేట్ సీపీ మురళీధర్ మహేష్ భగవత్ వీదుల వెంట ఉన్న గ్రామస్తులు, మీడియా ప్రతినిధులను ఇక్కడి నుంచి తరలించమని తుర్కపల్లి ఎస్ఐ మధుబాబును ఆదేశించారు. కాగా బందోబస్తు లో పాల్గొన్న రక్షకభటులకు మాత్రం తిండికి తిప్పలొచ్చింది. గ్రామంలోని హాస్టల్ భవనంలో ఏర్పాటు చేసిన భోజనాలకు పోలీసులు లంచ్ టైం కు ఒకేసారి భారీగా చేరుకున్నారు. అప్పటికే ఆకలితో నకనక లాడుతున్న పోలీసులు ప్లేట్లతో అన్నం కోసం పోటీ పడ్డారు.