Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్థ బలపడుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని నాగిలిగొండ గ్రామంలో పార్టీ గ్రామశాఖ మహాసభ జమ్ముల దామోదర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా పొన్నం మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైనా, కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. నాటి నుండి నేటి వరకు ప్రజల తరపున నికరంగా పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పేదలకు భూములు ఇవ్వాలంటే లేవు అని చెప్పి ప్రభుత్వ భూముల అమ్ముకొని డబ్బులు సమకూర్చుకోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం శాఖా కార్యదర్శిగా కొప్పుల వీరయ్య, సహాయ కార్యదర్శిగా రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు, మద్దిన్ని బసవయ్య, పులి యజ్ఞనారాయణ, గడ్డం రమణ, నాయకులు మద్దన్న రాము, శాఖా కార్యదర్శి వీరయ్య, సహాయ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.