Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్నగర్
హుజూర్నగర్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని సిమెంట్ పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకు కల్పిస్తే కొత్త పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపు వంటి వాటికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో పరిశ్రమలకు తన సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అప్రెంటిస్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐసీ చైర్మెన్ బాలమల్లు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.