Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
- సూర్యాపేట నూతన కలెక్టరేట్, మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలన
నవతెలంగాణ - సూర్యాపేట
కొత్త కలెక్టరేట్, మెడికల్ కళాశాల భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్, మెడికల్ కళాశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలెక్టరేట్ వెళ్లే రోడ్డుకు సైడ్ డ్రయినేజీ కాలువల ఏర్పాటుకు అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, బార్సు, గర్ల్స్ వసతి గృహాల పనులు కూడా పూర్తి కావొస్తున్నట్టు తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ క్వార్టర్స్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియాస్పత్రి పర్యవేక్షకులు మురళీధర్ రెడ్డి, ఇఈ యాకూబ్, అజీజ్, డీఈ మహిపాల్‌రెడ్డి, ప్రసాద్, కాంట్రాక్టర్ గుప్తా, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.