Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక చట్టాల రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ రైతు, వ్యకాస, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి జల్లేల పెంటయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబేట్టేందుకు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం నికరంగా గొంతెత్తి మాట్లాడి ప్రజల పక్షాన పోరాడాలన్నారు. తెలంగాణ అసెంబ్లిలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం,వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, సీఐటీయూ నాయకులు మూషం నరహరి, పిట్టల శ్రీనివాస్, బేడిద లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.