Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కిగౌడ్
నవతెలంగాణ -భువనగిరి/భువనగిరిరూరల్
రానున్న కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తలు నాయకులు మరింత పట్టుదలతో ప్రజాసేవలో ఉండాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తెలిపారు. గురువారం భువనగిరి దీప్తి హోటల్లో కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికి ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లాలో చేస్తున్న సేవలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఎంతో బలాన్నిస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ దగ్గర కుంభం అనిల్‌కు మంచి పేరు ఉందన్నారు. ఈసమావేశంలో పట్టణ కార్యదర్శి బిసుకుంట్ల సత్యనారాయణ, తంగళ్ళపల్లి రవికుమార్, మల్లారెడ్డి, అవెస్ చూపిస్తుంది, మజర్, నాగయ్య, చిక్కులు వెంకటేష్, సోమయ్య, మనోజ్ పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌గా నియమితులైన నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ని మొదటిసారి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనీల్ కుమార్ రెడ్డితో కలిసి గురువారం యాదగిరిగుట్టకు వచ్చిన సందర్భంగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి ఘన స్వాగతం పలికి శాలువాలతో ా సన్మానించారు. ఈకార్యక్రమంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్,యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాటూరి బాలయ్య గౌడ్,జిల్లా కార్యదర్శి కాల్వకొలను సతీష్ బట్,బాలన్న యూవసేన అధ్యక్షుడు కొమ్మగాని శంకర్ గౌడ్,తుర్కపల్లి మండల నాయకులు పిడుగు రమేశ్ పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కిని జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గురువారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉటుకూరి సురేష్ , పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ శివ శంకర్ ,,పటేల్ గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు జాంగిర్ ,బిర్లా యువసేన మండల అధ్యక్షుడు అఖిల్ పాల్గొన్నారు.