Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ - సూర్యాపేట
ట్రైనీ ఎస్సైపై లైంగికదాడికి యత్నించిన మరిపెడ ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిని సర్వీస్ నుంచి తొలగించాలని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్రవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.