Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి
నవతెలంగాణ - నూతనకల్
ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి కోరారు. గురువారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో అభి హెల్ప్‌లైన్, ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన వారికి చదువు చెప్పే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పన్నాల రమమల్లారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ఉమామహేశ్వరి, మండల కో ఆర్డినేటర్ నాగమణి, గ్రామ కోఆర్డినేటర్లు రంజాన్, మహేష్, తస్లిమా, ముంతాజ్, షబానాబేగం, రేణుక, ఉమారాణి పాల్గొన్నారు.