Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
ప్రభుత్వం అందిస్తున్న ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల పర్యవేక్షణ అధికారి బట్టు మధు కోరారు. గురువారం మండలంలోని దిర్శించర్ల గ్రామంలో ఆయన పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు శ్రీనివాసరావుతో కలిసి ఆన్లైన్ తరగతులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ఆన్లైన్ తరగతులను వీక్షించి సంబంధిత నివేదికను ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆన్లైన్ బోధన విజయవంతానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి, వి.రమేష్, బీ.శంకర్‌నాయక్, జే.శ్రీనివాస్, జి.జనార్ధన్, ఎస్.శ్రీనివాసులు, ఎన్.కోటిరెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.