Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నకిరేకల్
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కషి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఓగోడు గ్రామంలో వాటర్ ప్లాంట్, సీసీ రోడ్, గొర్రెల మందు పంపిణీ కార్యక్రమాన్ని , నడిగుడెం గ్రామంలో వైకుంఠ ధామం, సీసీ రోడ్, డ్రయినేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఒగోడులో సీసీ రోడ్డు, డ్రయినేజీ నిర్మాణానికి రూ 10 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆచార్య జయశంకర్ జయంతి పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ జెడి ఏ యం వి సుబ్బారావు, సర్పంచులు అబ్బ గోని విజయలక్ష్మి శ్రీనివాస్, మాద నాగరాజు, పగడపు నవీన్ రావు, ఎంపీటీసీ లో డే సాగర్, పశుసంవర్ధక శాఖ వైద్యులు జే. రామ్ రెడ్డి, సిహెచ్.మహిపాల్ రెడ్డి, నాయకులు ఏకుల విజరు కుమార్, పెండెం సదానందం, గుండ గొని జంగయ్య గౌడ్,వి. రమేష్ పాల్గొన్నారు.