Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ - కోదాడరూరల్
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 5, 6 వార్డుల కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, కందుల కోటేశ్వరరావులతో కలిసి అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు, పట్టణ సీఐ నరసింహారావు, టీఆర్ఎస్ పట్టణా ధ్యక్షులు చందు నాగేశ్వర్రావు, వనపర్తి లక్ష్మీనారాయణ, షేక్ రహీమ్, కట్టబోయిన శ్రీనివాస్‌యాదవ్, శిరంశెట్టి వెంకటేశ్వర్లు, మాధవి, పట్టణ ఎస్సై క్రాంతికుమార్, లలిత, ఈదుల కృష్ణయ్య, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.