Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గీత కార్మికోద్యమ యోధుల యాది సభలను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు కొండ.వెంకన్న పిలుపు నిచ్చారు. శుక్రవారం మండలంలోని జీకే అన్నారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18 వరకు యోధులయాది కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. గీత కార్మిక హక్కుల కోసం పని చేసి అమరు లైన సర్దార్ సర్వాయి పాపన్న. ధర్మబిక్షం, యస్, అర్ దాట్ల, తొట్ల మల్సూర్, దేశిని చిన మల్లయ్య, బైరు మల్లయ్య, వేముల.నాగయ్య. చెన్నయ్య. లింగయ్య.సూదగాని యెట్టయ్య , మొరిగాడి యాదగిరి, మునుకుంట్ల ఎల్లయ్య,లాంటి, అమర వీరుల స్ఫూర్తి తో గీత కార్మిక హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమంకోసం 5 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈశమావేశంలో అధ్యక్షుడు కొండ రాములు. కొండ అంజయ్య, చంద్రయ్య ,శ్రీ హర్ష, కుమార్, శ్రీనివాస్ రెడ్డి,మంగళ సత్తయ్య, లక్ష్మయ్య, వరుణ్, సాయి,మనీ, సత్తిరెడ్డి ,లింగయ్య, పాల్గొన్నారు.