Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ - ఆలేరుటౌన్
నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 100పడకలు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో సుదగాని సత్యరాజయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం విధి విధానాలు ప్రకటించాలని కోరారు. దళితులందరికీ దళితబంధు అమలు చేయాలన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, లేబర్ కొడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల9న క్విట్ ఇండియా స్పూర్తితో నిర్వహించే సేవ్ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, మండల కార్యదర్శి మోరిగాడి రమేష్, మండల కమిటీ సభ్యులు దుపటి వెంకటేష్, నల్లమస తులసయ్య, పిక్క గణేష్ ,అందే అంజయ్య, తదితరులు పాల్గున్నారు.