Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2023లో కేసీఆర్ను గద్దె దించాలి
- మంద కృష్ణ మాదిగ
నవతెలంగాణ -నల్లగొండ
ఏడేండ్ల నుండి దళితులను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నాడని, ఉప ఎన్నిక ల పేరిట దళితులను మరోసారి మోసం చేయడానికి కుట్ర పన్నాడని ఇప్పటికైనా దళితులు కేసీఆర్ మాటలు విని మరోసారి మోసపోవద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కష్ణ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలో 59 ఉపకులాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్సీల సమగ్ర అభివద్ధి సాధన సదస్సులో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ పథకాన్ని మరోసారి మోసపూరిత పథకంగా మార్చవద్దని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుల కంటే దొరల పాత్ర వెనుకబడి ఉందని అన్నారు. తెలంగాణలో దొరలు దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ని కాపాడింది, జైలు కెళ్ళింది ఆత్మహత్య చేసుకున్నది 90శాతం మంది దళితులే అని చెప్పారు. మొదటగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీనిచ్చి మోసం చేశాడన్నారు. హుజురాబాద్ ఎలక్షన్ ముందే రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. 2023లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి దళితుడు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 82శాతం దళితులకు భూమి లేదని తెలిపారు. ప్రభుత్వం ఏడేండ్ల కాలంలో ఆరు వేల దళిత కుటుంబాలకు భూమి ఇచ్చి వెంటనే కేసీఆర్ రైతు వేదికలు పల్లె ప్రకతి వనం వైకుంఠ దామాల పేరుతో 70 వేల దళితుల కుటుంబాల భూములను లాక్కుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు షరతులు లేకుండా దళిత బంద్ పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జిల్లా అధ్యక్షులు భొగరి విజరు ,వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి సైదులు , ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ కందుకూరి సోమయ్య హోలీమా దాసరి కుల సంఘం జిల్లా అధ్యక్షులు రావుల శ్రీనివాస్ , విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు రుద్రం శ్రీనివాస్ , జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పెరిక శ్రీనివాసులు దొమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు అన్నే పూడి నగేష్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జానకి రామయ్య చౌదరి నాయకులు కందుకూరి సోమన్న లంకపల్లి నగేష్ , దాసరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జహంగీర్ పాల్గొన్నారు.