Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మండలంలోని యాద్గార్పల్లిలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రేవతి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, ఆయాలు జె.లక్ష్మి, సత్యలక్ష్మి, నాగుర్బీ పాల్గొన్నారు.
పెద్దవూర : తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మండలంలోని కుంకుడుచెట్టుతండా అంగన్వాడీ కేంద్రంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమావత్ ప్రియాంక మాట్లాడుతూ తల్లిపాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ శారద, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతలకు పౌష్టికాహారం, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితారాధారెడ్డి, సీడీపీవో వెంకటలక్ష్మి, నర్సింహారావు, జిల్లా పోషణ్ అభియాన్ అధికారి సంపత్, కూచిపూడి సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు, మండల కో ఆప్షన్ సభ్యులు ఉద్దండు, మండల కార్మిక విభాగం అధ్యక్షులు కొళ్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.